Thursday, 17 September 2020

ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. కేజీఎఫ్2 టీజర్ వచ్చేది అప్పుడే!

దేశంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాల తర్వాత అంత క్రేజ్ సాధించిన సినిమా కేజీఎఫ్. కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులను కొల్లగొట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ బేక్ పడింది. కేజీఎఫ్-2 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Also Read: పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న దీనిపై అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. కేజీఎఫ్-2కు సంబంధించి తాజాగా వచ్చిన వార్తతో ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ సాఫీగా సాగుతుండటంతో టీజర్‌ను వీలైనంత త్వరగా సిద్ధం చేసి విడుదల చేయాలని యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 25న అన్ని భాషల్లోనూ కేజీఎఫ్-2 టీజర్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్‌లోపు షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3myV84C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...