Thursday, 17 September 2020

Narendra Modi: అది నా అదృష్టం.. అందువల్లే సాధ్యమైంది.. మహేష్ బాబు ట్వీట్‌పై మోదీ రియాక్షన్

నేడు (సెప్టెంబర్ 17) భారత ప్రధాని నరేంద్ర సందర్భంగా శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు బర్త్ డే విషెష్ అందుతున్నాయి. ఉదయం నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, బీజేపీ లీడర్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ రోజుతో 69 వసంతాలు పూర్తిచేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టారు మోదీ. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో ఆయనకు విష్ చేస్తూ ఓ సందేశం పోస్ట్ చేయడంతో దానిపై వెంటనే రియాక్ట్ అవుతూ ఆకట్టుకున్నారు మోదీ. మోదీకి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ''గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వ లక్షణాలతో భారత దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. మహేష్ పెట్టిన ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన .. ''దేశంలో వచ్చిన ఈ మార్పు భారతీయ పౌరుల సహకారం వల్లే సాధ్యమైంది. దేశ ప్రజలందరి సపోర్ట్, పార్టిసిపేషన్ ద్వారానే మనం ముందుకెళ్తున్నాం. వారికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం'' అని పేర్కొన్నారు. దీంతో మహేష్- నరేంద్రమోదీ ట్వీట్స్ జనాలను ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. Also Read: ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇందులో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని కన్ఫర్మ్ చేయగా, మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E9pngW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...