Thursday, 17 September 2020

పవన్-గురూజీ కాంబోపై రూమర్స్.. ఇంతకీ వాళ్ల ప్లాన్ ఏంటో?

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒకటి. స్నేహితులైన వీరిద్దరి నుంచి జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు తెరకెక్కాయి. వీటిలో జల్సా హిట్ కాగా.. అత్తారింటికి దారేది పవన్ కెరీర్లోనే సూపర్‌హిట్ సినిమాగా నిలిచింది. హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన అజ్ఞాతవాసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహ బంధానికి మాత్రం ఎలాంటి అడ్డు రాలేదు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన చేసే ప్రతి పని వెనుక ఐడియాలజీ ఉంటుందని చెబుతుంటారు. పవన్ జంధ్యం వేసుకోవడం, హోమాలు, యాగాలు చేయడం, చాతుర్మాస దీక్ష చేపట్టడం వంటి వాటి వెనుక త్రివిక్రమ్ ఉన్నారని టాక్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోగా.. త్రివిక్రమ్ అరవింద సమేత, అలా వైకుంఠపురం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో బ్యాక్ బౌన్స్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్‌ని మరోసారి డైరెక్ట్ చేసేందుకు ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించి ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. Also Read: ఈ నేపథ్యంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందా? అన్న పుకార్లు ఫిల్మనగర్‌ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఎప్పుడు డేట్లు అడిగినా పవన్ సిద్ధమేనని, ఎన్టీఆర్‌తో కమిట్‌మెంట్ ఉండటం వల్ల ఆయన ఆ కాంబినేషన్లో ముందడుగు వేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తర్వాత ఈ దర్శకుడు రామ్‌చరణ్‌తో పనిచేస్తారని టాక్ నడుస్తోంది. దీంతో పవన్-త్రివిక్రమ్ కాంబో ఇప్పుడిప్పుడే కుదురుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. త్రివిక్రమ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసుకునే సరికి ఎన్నికలు గనుక వస్తే పవన్ ప్రచారంలో బిజీ అయిపోతారు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేక పుకారుగానే మిలిగిపోతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mx6RR9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...