Wednesday, 2 September 2020

PSPK27 Movie Pre Look: చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపించేలా పవర్ స్టార్

పవర్ స్టార్ పుట్టినరోజు కానుకగా మరో సర్ పైజ్ పోస్టర్‌ వచ్చేసింది. ఇప్పటికే పవన్ రీ ఎంట్రీ మూవీ మోషన్ పోస్టర్ వీడియోతో అభిమానులు సంబరాల్లో ఉండగా.. దర్శకత్వంలో తెరకెక్కుతున్న 27 మూవీ ప్రీ లుక్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన దర్శకుడు క్రిష్.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటకి కనిపిస్తుందని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పవన్‌క‌ల్యాణ్‌గారు మీ 27వ చిత్రం పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌’’ అని క్రిష్ ట్వీట్ చేశారు క్రిష్. కాగా పవన్ తాజా పోస్టర్‌తో సినిమాపై హైప్ వచ్చేసింది. ఉంగ‌రాలు, చేతికి క‌డియం, గ‌రుత్మంతుడు బొమ్మతో పవన్ కళ్యాణ్ ఫేస్‌ని రివీల్ చేయకుడా ఈ ప్రీ లుక్‌ని విడుదల చేశారు. పవన్ గెటప్.. బ్యాగ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే.. క్రిష్ మరోసారి పీరియాడిక్ కథాంశంతో పవన్ కళ్యాణ్‌ని యుద్ధ వీరుడిగా చూపించబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31PGcqf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...