Wednesday, 2 September 2020

పవన్‌కి శుభాకాంక్షల వెల్లువ.. మహేష్ ట్వీట్‌కి ఫ్యాన్స్ ఫిదా, వరల్డ్ రికార్డ్ ట్వీట్‌ వార్‌‌లో సూపర్ స్టార్ సైతం

నామ స్మరణతో ట్విట్టర్ హీటెక్కిపోతుంది.. #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో పవన్ అభిమానులు ట్విట్టర్ పిట్టకు ఊపిరి సలపనీయడం లేదు.. టార్గెట్ 100 మిలియన్స్ (పది కోట్లు) అంటూ ట్వీట్లను దంచి కొడుతున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన ట్వీట్ వార్ ఈరోజు సాయత్రం 6 వరకూ ఉండబోతుంది. ఎలాగైనా 100 మిలియన్ ట్వీట్లు చేసి పాత రికార్డుల్ని చెరిపేయడానికి పవన్ ఫ్యాన్స్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ ట్వీట్స్ వార్‌ వారి ముందున్న లక్ష్యం 60.2 మిలియన్ల ట్వీట్లు. మహేష్ బర్త్ డే నాడు 60.2 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఆయన ఫ్యాన్స్. ఈ రికార్డ్‌ని బీట్ చేసి 100 మిలియన్స్ ట్వీట్లు చేయాలని పవన్ ఫ్యాన్స్ ఉత్సాహం ప్రదర్శిస్తుంటే.. ఇందులో తాను కూడా భాగమై ఒక ట్వీట్ వేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. మీ వినయం, దయ ప్రభావితం చేసే విధంగా ఉంటాయి.. మీకు మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నా.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ అంటూ విషెష్ అందించారు మహేష్ బాబు. సినిమా రికార్డుల మాదిరే ట్విట్టర్ రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఫ్యాన్స్ హంగామా తప్పితే హీరోలు మాత్రం మేమంతా ఒక్కటే అని పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. తాజా ట్వీట్‌తో మహేష్ బాబు మరోసారి రుజువు చేశారు. ఇక మహేష్ బాబుతో పాటు చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, నితిన్, బండ్ల గణేష్, రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర హీరో హీరోయిన్లు పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ చూద్దాం!!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YZm1EB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...