తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడమే. ‘‘ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. అయితే, మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆయనకు చంద్రబాబు విషెస్ చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెరపైకి తీసుకొచ్చారు. ‘‘ఈ మధ్య అందరు హీరోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే మీకు మా ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు గుర్తులేదా. మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు. చాలా బాధగా ఉంది’’ అంటూ తారక్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది ఇలా చాలా సాఫ్ట్‌గా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. చంద్రబాబు తరవాత పార్టీని నడిపించే శక్తి, సామర్థ్యం ఒక ఎన్టీఆర్‌కే ఉందని.. కాబట్టి, ఇకనైనా చంద్రబాబు మారాలని, ఎన్టీఆర్‌కు మర్యాద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు చాలా మంది టీడీపీ ఫాలోవర్లకు ఈ విషయంలోనే చంద్రబాబు నచ్చడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇక చంద్రబాబుపై ట్రోలింగ్ చేసేవాళ్లు అయితే రకరకాలుగా సరదా కామెంట్లు, మీమ్స్‌తో కామెంట్లు పెడుతున్నారు. ‘ఎన్టీఆర్ బర్త్‌డే రోజు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది సార్’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనసైనికులు సైతం చంద్రబాబుపై కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది జనసైనికులు చంద్రబాబు శుభాకాంక్షలను స్వాగతించినా.. చాలా మంది ‘‘మమ్మల్ని వదిలిపెట్టరా? దయచేసి మా గురించి లోచించడం మానేయండి’’, ‘‘దమ్ముంటే జనసేన అధ్యక్షుడు అని ట్వీట్ చేయి చూద్దాం’’.. ఇలా చంద్రబాబుపై అంతెత్తున లేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద తన మాజీ భాగస్వామి పవన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయ్యింది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QQ3pSI
v
No comments:
Post a Comment