Wednesday, 2 September 2020

Pawan Kalyan: పీకే‌కి శ్రీరెడ్డి బర్త్ డే విషెష్.. తనదైన శైలిలో ఇలా

పుట్టినరోజు పండుగ వేళ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి బద్ధ శత్రువు.. ఆయన పేరు చెబితేనే ఒంటికాలిపై లేచి తాండవం చేసే ప్రస్తావన తీసుకురావడం అవసరమా? అని అనుకోవచ్చు కాని.. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్‌ని దూషించడానికో.. ఆయన్ని బూతులు తిట్టడానికో.. లేక ఏవేవో వేళ్లు చూపించడానికో అయితే శ్రీరెడ్డి గురించి ప్రస్తావించడం అనవసరమే. కాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊహించని విధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసింది శ్రీరెడ్డి. అయితే అందరిలాగే ఏదో విషెష్ చెప్పేస్తే.. ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది. అందుకే ‘ ఐ హేట్ యు బట్ హ్యాపీ బర్త్ డే పీకే’ అంటూ విషెష్ అందించింది శ్రీరెడ్డి. పవన్ పేరు చెబితో నోటికొచ్చినట్టి మాట్లాడి.. బండ బూతులతో చెలరేగిపోయే శ్రీరెడ్డి అవన్నీ పక్కన పెట్టిందో లేదో తెలియదు కాని.. మొత్తానికైతే పవన్ కళ్యాణ్‌కి విషెష్ అందించడాన్ని ఆయన ఫ్యాన్స్ చాలా మర్యాదగానే స్వాగతిస్తున్నారు. గతంలో పవన్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డి ఏ పోస్ట్ పెట్టినా పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో తిట్టిపారేసేశారు. ఎందుకంటే పవన్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది అంటే అది ఖచ్చితంగా బూతు పురాణం అయ్యే ఉంటుందనే నమ్మకం. కాని ఈసారి మాత్రం జస్ట్ హేట్ అనే మాటతో సరిపెట్టేసి శుభాకాంక్షలు తెలియజేయడం శుభపరిణామమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z0Mp0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...