Wednesday, 2 September 2020

మహేష్‌కు ఆ పార్ట్ బాగా నచ్చింది.. సినిమా కథేంటంటే: ‘V’ మూవీపై సుధీర్ బాబు ఇంటర్వ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, నిర్మాత‌గా త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సుధీర్ బాబు. ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో సుధీర్ బాబు న‌టించిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ కూడా ఈ చిత్రంలో న‌టించారు. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో హీరో సుధీర్ బాబు వెబినార్‌ ద్వారా పాత్రికేయుల‌తో మాట్లాడారు. ✦ ‘వి’ సినిమాను ముందుగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నే అనుకున్నాం. కానీ.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే ప‌రిస్థితి లేదు. అందుక‌నే ఓటీటీలోనే విడుద‌ల చేస్తున్నాం. ఓటీటీలో సినిమాను విడుద‌ల చేయ‌డం కూడా ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ‘వి’ సినిమాను 200 దేశాల్లో విడుదల చేస్తున్నాం. దీని వ‌ల్ల తొలి రోజునే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్. ✦ లాక్‌డౌన్ స‌మ‌యంలో రెండు రోజుల‌కొక క‌థ చొప్పున వింటూ వ‌చ్చాను. అందులో రెండు క‌థ‌ల‌ను ఓకే చేశాను. ఆ వివ‌రాల‌ను స‌ద‌రు నిర్మాణ సంస్థలు ప్రక‌టిస్తేనే బాగుంటుంది. ✦ ‘వి’ సినిమాలో నా పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే పాత్ర. ఇంద్రగంటి గారు క‌థ చెప్పగానే నాకు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర బాగా న‌చ్చింది. చాలా మందికి స్ఫూర్తిగా ఉండే స‌ద‌రు ఆఫీస‌ర్‌ను ఓ కిల్లర్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఏం చేస్తాడనేదే సినిమా. జ‌స్టిఫికేష‌న్ ఉండే పాత్రలో కనిపిస్తాను. Also Read: ✦ సినిమాలో యాక్షన్‌, డ్రామాకు మంచి స్పేస్ కుదిరింది. యాక్షన్ విష‌యానికి వ‌స్తే.. సాధార‌ణంగా బాడీని ఫిట్‌గానే ఉంచుకుంటాను. రెఫ‌రెన్స్‌గా ఇంద్రగంటి గారు బ్రాడ్‌పిట్ యాక్ట్ చేసిన ఫైట్ క్లబ్ త‌ర‌హాలో నా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాల‌ని కూడా చెప్పారు. దాంతో నేను బాడీని మ‌రింత ఫ్లెక్సిబుల్‌గా చేసుకున్నాను. ✦ నా ఇంట్రడ‌క్షన్ ఫైట్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఫైట్ మాస్టర్ ర‌వివ‌ర్మ గారు ఆ ఫైట్‌ను స్పెష‌ల్‌గా డిజైన్ చేశారు. ✦ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత మ‌హేష్‌కు అందులో యాక్షన్ పార్ట్ బాగా న‌చ్చింది. ఆ విష‌యాన్ని నాకు చెప్పారు. త‌న‌కు ఇంద్రగంటి గారంటే చాలా మంచి ఓపినియ‌న్ ఉంది. ‘సమ్మోహనం’ సమయంలో ఆ విష‌యాన్ని నాకు చెప్పారు. ‘వి’ సినిమా కోసం త‌ను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పారు మ‌హేష్. ✦ హీరోయిన్ నివేదా ఇందులో అపూర్వ పాత్రలో క‌నిపిస్తుంది. త‌ను క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత‌. మా మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ కంటే హీరో, విల‌న్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అలాగే అదితిరావు హైద‌రి కూడా చ‌క్కటి నటన కనబరిచింది. త‌న పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. Also Read: ✦ ఇంద్రగంటి గారు సినిమాల్లో మంచి సంభాష‌ణ‌లుంటాయి. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మంచి సంభాష‌ణ‌ల‌తో పాటు మంచి యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. ✦ నేను, నాని కంఫ‌ర్ట్ యాక్టర్స్‌. ఇద్దరం కొల‌త‌లు వేసుకుని న‌టించ‌లేదు. ఆర్టిస్ట్‌గా న‌మ్మకం ఉండ‌టంతో నానితో క‌లిసి ఈ సినిమా చేయ‌డానికి యాక్సెప్ట్ చేశాను. ఇద్దరం పోటీ ప‌డ‌టం అన‌డం కంటే మా క్యారెక్టర్స్ సినిమాలో పోటీప‌డ‌తాయ‌ని చెబితే చ‌క్కగా ఉంటుంది. ✦ ఇంద్రగంటి గారు సెట్స్‌లో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆయ‌న సెట్‌లో ఆర్టిస్టులు రిలాక్స్‌డ్‌గా ఉంటారు. కానీ, డైరెక్టర్‌గా టెన్షన్ అంతా ఆయ‌నే తీసుకుంటారు. సినిమా ముందు యూనిట్‌ను ఇంద్రగంటి గారు చాలా ప్రిపేర్ చేస్తారు. కాబట్టి సెట్స్‌కు వచ్చేటప్పటికి చాలా కాన్ఫిడెంట్‌గా వస్తారు. ✦ విల‌నిజం ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు నేను ‘బాఘి’లో చేసిన విల‌నిజం ఈ సినిమాతో పోల్చితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో నాని నెగ‌టివ్ షేడ్స్‌లో త‌న యాక్టింగ్‌తో ఓ డిఫ‌రెంట్ లుక్ తీసుకొచ్చాడు. Also Read: ✦ పుల్లెల గోపీచంద్‌ గారి బ‌యోపిక్‌ కొన్ని కారణాలతో వెనక్కి వెళుతుంది. డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది నేను చేయ‌బోయే ప్యాన్ ఇండియా మూవీ. ✦ మంచి కాన్సెప్ట్స్ కోసం బాగా వెయిట్ చేస్తాను. నేనే అని కాదు.. ఎవ‌రైనా మంచి కాన్సెప్టుల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. అందుకే నేను చూజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ✦ వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా అభ్యంత‌రం లేదు. మంచి ప్రొడ‌క్షన్ హౌసెస్‌, బడ్జెట్ కుదిరితే చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌ను. అలాగే, నా ప్రొడ‌క్షన్‌లోనూ వెబ్ సిరీస్‌ల‌ను చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. నిర్మాత‌గా కూడా జాయింట్ వెంచ‌ర్స్ చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32NUiI6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...