Tuesday, 22 September 2020

Namrata Shirodkar: మహేష్ బాబు ఒడిలో నమ్రత.. వెరీ వెరీ స్పెషల్.. ఇలా కూడా మార్కులు సితార పాపకే!

టాలీవుడ్ సెలబ్రిటీల్లో మోస్ట్ పాపులర్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు- . హీరోయిన్‌గా మహేష్ సరసన నటించి ఆ తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లాడింది నమ్రత. ఘట్టమనేని వారింట అడుగుపెట్టాక కెమెరాకు దూరంగా ఉంటున్న ఆమె.. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో సలహాలు, సూచనలిస్తూ ఉంటుందట. తెరవెనుక వెన్నుముకగా ఉంటూ అన్నీ తానై చేసుకుంటుందట. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కాగా తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఓ స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్‌ బాబు సతీమణి నమ్రత.. తాజాగా తన భర్తపై ప్రేమను కురిపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. ''జీవితంలో ప్రేమగా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నాకు నమ్మకం కలిగింది. మన సంతోషానికి కారణం కారణం ప్రేమనే. ఆనందకరమైన జీవితం కేవలం ప్రేమతోనే సాధ్యమవుతుంది. దయ, కరుణ, జాలి వంటి వన్నీ ప్రేమతో నిండిన భావోద్వేగం నుంచే ఉత్పన్నమవుతాయి. ఒకరితో ఒకరు, ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలి. నిజమైన సంతోషంతో నేను దిగిన ఫొటో ఇది. పాప ఈ ఫోటో కాప్చర్ చేసింది'' అని పేర్కొంది నమ్రత. Also Read: ఈ ఫొటోలో కనిపిస్తుండటం, పైగా సితార ఈ పిక్ కాప్చర్ చేసిందని ఆమె పేర్కొనడంతో నెట్టింట వెంటనే వైరల్ అయింది. సూపర్ స్టార్ అభిమానులు ఈ పిక్ చూసి తెగ మురిసిపోతున్నారు. ''ఇంతకంటే క్యూట్ పిక్ ఈ ప్రపంచంలో ఉండదు, సితార పాప టాలెంట్ సూపర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఫొటోతో ఎక్కువగా మార్కులు కొట్టేసింది సితారనే అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం 'సర్కారు వారి పాట' మూవీ కోసం రెడీ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hVCm3A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...