Tuesday, 22 September 2020

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనా కాటుతో బాలీవుడ్ సీనియర్ నటి కన్నుమూత

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా విలయతాండవంలో చోటుచేసుకుంటున్న సెలబ్రిటీల మరణాలు సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ తారలు కరోనా కారణంగా తుది శ్వాస విడువగా.. తాజాగా సీనియర్ బాలీవుడ్, మరాఠీ నటి (83) కరోనా కాటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె కరోనాతో బాధపడుతున్న ఆశాలత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతారాలోని ప్రతిభ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూనే ఆమె తుది శ్వాస విడిచారు. మరాఠీ రంగస్థల నటిగా ఫేమస్ అయిన ఆశాలత వబ్‌గాంకర్ ముందుగా కొంకణీ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. కొంకొణి, హిందీ, మరాఠీ సినిమాల్లో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో ఆమె నటించింది. ఆ తర్వాత మరాఠీ ప్రసారమయ్యే పలు టీవీ సీరియల్లో అత్త, అమ్మ పాత్రల్లో మెప్పించింది. ఆశాలత మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FZAGsu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...