Tuesday, 22 September 2020

Anushka Sharma: బేబీ బంప్‌తో బికినీ పోజిచ్చిన్న అనుష్క.. సమంత క్రేజీ రియాక్షన్

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా, తనలో ఎంత హాట్‌నెస్ ఉన్నా గర్భవతి అయ్యాక కెమెరాకు కాస్త దూరంగానే ఉండటం సహజం. కానీ అందుకు భిన్నంగా బేబీ బంప్‌తోనే బికినీ పోజిచ్చి షాకిచ్చింది స్టార్ హీరోయిన్ . బ్లాక్ స్విమ్ సూట్‌లో మ్యాజిక్ చేయడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ పిక్ చూసిన అక్కినేని కోడలు తనదైన స్టైల్‌లో స్పందిస్తూ ఈ ఫోటోపై కామెంట్ పెట్టింది. Also Read: ప్రేమ వివాహం చేసుకొని సెలబ్రిటీ కపుల్‌గా క్రేజ్ కొట్టేసిన విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జోడీ అతిత్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మేమిద్దరం ఇకపై ముగ్గురం కాబోతున్నామంటూ అనుష్క డెలివరీ డేట్ తెలిపారు విరాట్. అనుష్క ప్రెగ్నెంట్ అంటూ గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ వచ్చే ఏడాది 2021 జనవరి నుంచి మా ఫ్యామిలీలో ముగ్గురం అని విరాట్ దంపతులు ప్రకటించారు. దీంతో ఈ లాక్‌డౌన్ విరామ సమయంలో గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేశారంటూ విరుష్క జోడీకి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. Also Read: ఈ నేపథ్యంలోనే తాజాగా తన బేబీ బంప్‌ని పూర్తిగా షో చేస్తూ ఓ స్పెషల్ బికినీ ఫోటో షేర్ చేసింది అనుష్క శర్మ. దీంతో కొన్ని నిమిషాల్లోనే ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన సమంత.. బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో దేవతలా అనుష్క కనిపిస్తోందని కామెంట్ చేసింది. చాలా డిఫరెంట్‌గా అనుష్క తన బేబీ బంప్ షో చేయడమే ఆశ్చర్యపరిస్తే.. దానికి సమంత పాజిటివ్ కామెంట్ చేయడం చూసి మోడ్రెన్ హీరోయిన్స్ చాలా ఓపెన్‌గా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు జనం. గతంలో కూడా హీరోయిన్లు సమీరా రెడ్డి, అమీ జాక్సన్ తమ తమ బేబీ బంప్స్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొన్నినెలల పాటు ఇంట్లోనే భార్య అనుష్కతో ఎంజాయ్ చేసిన కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ ఆడుతుండగా.. గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్ అవుతోంది. అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అంతా కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EluXNg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...