సినిమా హీరోలకు అభిమానులే కొండంత బలం. తమ హీరోలకు ఏమైనా జరిగితే అభిమానులు ఎంత తల్లడిల్లిపోతారో.. ఫ్యాన్స్‌కు కష్టమొచ్చినా హీరోలూ అలానే బాధపడతారు. అదే ఒక అభిమాని అకాల మరణం చెందిదే ఆ హీరో పడే బాధ అంతా ఇంతా కాదు. తోబుట్టువుని కోల్పోయినంత బాధలో ఉంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అంతే బాధలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నటశేఖర కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు దాసరి సురేష్ బాబు గురువారం కన్నుమూశారు. సురేష్ బాబు మరణవార్త తెలిసి మహేష్ బాబు ఎంతో బాధపడ్డారు. ఆయన అకాల మరణవార్త విని తన గుండె బద్ధలైందని అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘దాసరి సురేష్ బాబు అకాల మరణం గురించి విని నా గుండెపగిలింది. నిజంగా ఆయన లోటు తీరనిది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన కుటుంబానికి మరింత ప్రేమ, సామర్థ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. కాగా, దాసరి సురేష్ బాబు అంత్యక్రియలు గురువారం సాయంత్రం నెల్లూరులో జరిగాయి. సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బైక్ ర్యాలీతో సురేష్ బాబు అంతిమ యాత్ర నిర్వహించారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ కింద ఆయన అభిమానులు స్పందిస్తూ.. సురేష్ బాబు చాలా మంచి వ్యక్తని కొనియాడుతున్నారు. మనిషి బంగారమని, మనసు వెన్న అని ప్రశంసిస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k3mfCt
v
No comments:
Post a Comment