Thursday, 10 September 2020

చిరంజీవి షాకింగ్ లుక్: గుండుతో స్టైలిష్‌గా.. సినిమా కోసం ప్రయోగం!

మెగస్టార్ కొత్త లుక్‌ను ట్రై చేశారు. తాను చేయబోయే సినిమాల్లో ఒక పాత్ర కోసం ఈ లుక్‌ను ట్రై చేశారు చిరు. అయితే, ఈ గుండు లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ లుక్ ఏ సినిమా కోసమో స్పష్టత లేదు కానీ.. చిరంజీవి మాత్రం ఈ గుండు లుక్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ట్రిమ్ చేసిన మీసాలు, గెడ్డం.. ఆపై బ్లాక్ గాగుల్స్ చిరంజీవిని హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఇలాంటి లుక్ చిరంజీవి గతంలో ట్రై చేయలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాలో ట్రై చేశారు. బాస్.. గుండు బాస్ అంటూ తనదైన మేనరిజంతో అలరించారు. మరి ఇప్పుడు చిరంజీవి ఎలా అలరిస్తారో.. ఏ సినిమాలో ఈ లుక్‌తో కనిపిస్తారో చూడాలి. ఈ మాంక్ లుక్‌ను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ప్రగ్యా జైస్వాల్, కళ్యాణ్ దేవ్, ఆర్జే చైతు, ‘వైవా’ హర్ష తదితరులు స్పందించారు. లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. మోషన్ పోస్టర్‌లో ఎర్ర కండువా వేసుకుని, చేతిలో కత్తిలాంటి పదునైన ఆయుధంతో చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఈ లుక్‌ చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. మరి సినిమా వస్తే ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m94dRj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...