Wednesday, 9 September 2020

మీకు దండం నాయనా.. నన్ను వదిన అనొద్దు.. పవన్ మీకు అన్నైనా.. నేను అక్కనే: మాధవీలత

ఇటీవల బర్త్ డే సందర్భంగా ఆయనపై ఫైర్ అయ్యింది మాధవీలత. పాపం ఆయన బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ సినిమా పోస్టర్స్‌ని విడుదల చేసిన బర్త్ డే ట్రీట్ ఇచ్చింది మాధవీలత. ‘మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పాడు.. కొనమని కాదు’ అంటూ ఆమె నటిస్తున్న ‘సత్యగ్రహి’ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తూ పవన్‌కి విషెష్ అందించింది. అలాగే.. ‘లేడీ’ సినిమా పోస్టర్‌ని కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది మాధవీలత. అయితే విషెష్‌పై రియాక్ట్ అవ్వకుండా.. ఎవరెవరో గతంలో పవన్‌ కళ్యాణ్‌ని దూషించిన వాళ్ల విషెష్‌కి పవన్ రియాక్ట్ అవడం పట్ల సీరియస్‌ అయ్యింది మాధవీలత. అటెన్షన్ కోసం బర్త్ డే విషెష్ అందించిన వాళ్లందరికీ రిప్లై‌లు ఇచ్చారు.. నిజమైన తనలాంటి వారికి మాత్రం పవన్ రిప్లై ఇవ్వలేదని బాహాటంగానే విమర్శించింది మాధవీలత. గతంలో ఎన్నడూ ఓట్ ఫర్ జనసేన అనని వాళ్లు.. పవన్‌‌ని కామెంట్లు చేసిన వాళ్లు ఈరోజు ప్రేమ కారిపోతూ విషెష్ అందిస్తుంటే.. ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం నాకు చాల కోపం తెప్పించింది. మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై’ అంటూ తన బాధను వ్యక్త పరుస్తూ సుదీర్ఘమైన లేఖను పవన్‌ని ట్యాగ్ చేసి వదిలిపెట్టింది మాధవీలత. అయితే పవన్ కళ్యాణ్ అంటే తొలినుంచి వీర విధేయత ప్రదర్శించే మాధవీలత.. నాకు స్క్రీన్ మీద తప్ప జీవితంలో నటన రాదు. నేనంటే నా పోస్ట్ ఇంతే.. అంటూ పవన్‌ని ఉద్దేశించి పోస్ట్ పెట్టిన మాధవీలత.. నేనేం కడుపు మంటతో ఈ పోస్ట్ పెట్టడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాధవీలత పోస్ట్ అంటే... ఆయనకు దగ్గరయ్యే విధంగానే ఉంటుంది. కాని ఈసారి కాస్త ఘాటుగా స్పందించడం పట్ల జనసైనికులు రియాక్ట్ అయ్యారు. కొంతమంది మాధవీలతను సపోర్ట్ చేస్తుంటే.. ఎప్పటిలాగే మరికొంత మంది తిట్టిపోశారు. అయితే ఒక జనసైనికుడు స్పందిస్తూ.. ‘ఓడినప్పుడు నేను ఓడిపోయాను అనిచెప్పడానికి సిగ్గు పడకండి... కాని ఓడిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం ఉంటుంది. ఆ అనుభవంఅంకెల్లో చెప్పలేని అవకాశాలను చూపిస్తుంది. ఆ అనుభవం ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది.. వదినమ్మా ఐ యామ్ విత్ యు’ అంటూ కామెంట్ చేశాడు. అయితే వదినమ్మ కామెంట్స్‌పై మాధవీలత రియాక్ట్ అవుతూ.. ‘మీకు దండం నాయనా.. వదిన ఏంటి?? అక్క అనండి. మీకు పీకే అన్నయైనా నేను అక్కనే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక మాధవీలత ఎప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి పోస్ట్ పెట్టినా... నాలుగో భార్య అని.. ఇంకేదో ఉందంటూ రకరకాల పిచ్చి కామెంట్లు వస్తూనే ఉంటాయి. వీటిపై కూడా తరచూ మాధవీలత ఘాటుగా రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆయన చేసుకుంటానన్నా నాకు ఇంట్రస్ట్ లేదని గతంలో కూడా చెప్పింది మాధవీలత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3igr2QB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...