Thursday, 10 September 2020

చెర్రీ దర్శకుడి కథతో ‘ఓదెల రైల్వేస్టేషన్’.. తొలిసారి ఆ పాత్రలో హెబ్బా పటేల్

ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కుతున్న చిత్రం ’’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో కె.కె.రాధామోహ‌న్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. Also Read: ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8ఎంఎం బుల్లెట్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016 వంటి హిట్ చిత్రాల‌తో పాటు `కేజీఎఫ్, మ‌ఫ్టీ, ట‌గ‌రు, గోధి బన్నసాధ‌ర‌న ‌మైక‌ట్టు, క‌వ‌చ‌, యువ‌ర‌త్న వంటి సుమారు 25 కన్నడ చిత్రాల్లో నటించిన వశిష్ట సింహా తెలుగులో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా వైవిధ్యమైన పాత్రలో హెబ్బా పటేల్ కనిపించనుంది. Also Read: మేక‌ప్‌, డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్‌, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు దర్శకుడు అశోక్ తేజ‌. `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన యదార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాయి రోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్(రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్డే తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: సినిమాటోగ్రఫీ: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, స‌మ‌ర్పణ: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది, ద‌ర్శకత్వం: అశోక్ తేజ‌. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k32hYD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...