Thursday, 10 September 2020

దిల్‌ రాజుకు బంపరాఫర్.. భారీ ధరకు అమ్ముడుపోయిన ‘వి’ హిందీ డబ్బింగ్ రైట్స్

నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావ్ హైదరీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వి’ సినిమా ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో 25వ చిత్రమైన ‘వి’పై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. Also Read: దీంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డిజిటల్ సంస్థలు పోటీపడినా దిల్‌రాజు మొదట ఒప్పుకోలేదు. చివరికి అమెజాన్ ప్రైమ్ రూ.33కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసి సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ ఇచ్చింది. అయితే తొలిరోజే నెగిటివ్ టాక్ రావడంతో యూనిట్ నిరాశ చెందింది. అయినప్పటికీ ప్రైమ్‌లో చాలామంది చూస్తూనే ఉన్నారు. Also Read: ఇప్పటికే ఓటీటీ ద్వారా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టిన ‘వి’ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ రూ.8కోట్లకు అమ్ముడుపోయాయి. మరోవైపు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.8.4కోట్ల డీల్ జరిగినట్లు సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k4Odhu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...