Saturday, 19 September 2020

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లవర్ బాయ్?

ఈ ఏడాది టాలీవుడ్‌లో అనేక మంది యువ హీరోలు పెళ్లి చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్‌‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. నితిన్, రానా, నిఖిల్ తదితరులు లాక్‌‌డౌన్ సమయంలో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు. శర్వానంద్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. తాజాగా మరో హీరోకి సంబంధించిన పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన తరుణ్.. 2000లో ‘నువ్వేకావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుస హిట్లతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస ప్లాపులతో వెండితెర నుంచి కనుమరుగై పోయాడు. ఇటీవలే ఓ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు ఆదరించలేదు. 37ఏళ్ల ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వ్యాపార పనులు చూసుకుంటున్నాడు. Also Read: ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, శశిరేఖా పరిణయం, నువ్వు లేక నేను లేను, ఒక ఊరిలో వంటి సినిమాలు తరుణ్‌కి మంచి పేరు తెచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32MZcGx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...