Saturday, 19 September 2020

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆమె సంజనా కాదు మహీరా అట!

కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న హీరోయిన మరో వివాదం ఇరుక్కుంది. ఆమె మతం మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లవ్ జీహాద్‌లో ఇరుక్కున్న ఆమె తన పేరును మహిరాగా మార్చుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చేశారు. డాక్టర్ అజీజ్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న సంజన ఇస్లాం మతం స్వీకరించిన తన పేరును మహిరాగా మార్చుకున్నారని ప్రశాంత్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో సంజన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. సంజన ముస్లిం మతంలోకి మారిన తర్వాతే అజీజ్‌తో నిశ్చితార్థం చేసుకుందని, లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మతం మార్చుకున్న ఆమెను ఇకపై సంజనా గల్రానీ అలియాస్ అర్చనా మనోహర్ గల్రానీగా పిలివకూడదని, మహిరాగానే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనాలని ప్రశాంత్‌ డిమాండ్ చేశారు. దీంతో పాటు కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుతం బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ తో కలిసి నటి సంజనా శ్రీలంక టూర్‌కు వెళ్లిన విషయం నిజమేనని ఆయన ఆరోపించారు. Also Read: ఇప్పటికే డ్రగ్స్ కేసులో పీకల్లోతు మునిగిపోయిన సంజనకు సంబంధించి రోజుకొక కొత్త అంశం తెరపైకి వస్తుండటం ఆమె కుటుంబసభ్యులు, అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందోనని అందరికీ టెన్షన్‌ మొదలైంది. అయితే సంజన బండారం మొత్తం తన వద్ద ఉందని, దాన్ని ప్రజలకు వివరిస్తానని ప్రశాంత్ సంబర్గి చెబుతున్నారు. తాజా ఆరోపణలతో సంజన నిజంగానే మతం మారిందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35S9FT2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...