కరోనా వైరస్ కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ చాలామంది సినీనటులు రియల్ హీరోలుగా అవతరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోనూసూద్ అయితే సాయం అన్న వారందరినీ ఆదుకుని జాతీయ హీరోగా ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రియల్ హీరో అయ్యారు. Also Read: విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ నిర్వాహకులు భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలంటూ గతేడాది సినీ ప్రముఖులను ట్యా్గ్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన సాయిధరమ్‌తేజ్ తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. దీంతో పాటు ఏడాది కాలం ఆ ఓల్డేజ్ హోమ్‌కు స్పాన్సర్‌షిప్ అందిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా ఈ మంచి పనిలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. వృద్ధులకు సాయం చేసిన తేజ్‌పై నెటినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్‌లోనే కాదు రియల్‌గానూ హీరో అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RGbSbL
v
No comments:
Post a Comment