Friday, 11 September 2020

ఛాన్స్ కోసం వెళ్తే బట్టలు విప్పమన్నాడు.. స్టార్ డైరెక్టర్‌పై మోడల్ ఆరోపణలు

మీటూ ఉద్యమం బాలీవుడ్‌ను వదిలేలా కనిపించడం లేదు. సినిమాల్లో అవకాశాల కోసం యువతులను లైంగికంగా దోచుకుంటున్నట్లు ఎంతో సినీ పెద్దలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖ దర్శకుడు పేరు కూడా గట్టిగా వినిపించింది. తన సినిమాల్లో ఛాన్సులు ఇస్తానని నమ్మించి తమను మోసం చేశాడంటూ చాలామంది అమ్మాయిలు ఆరోపణలు చేశారు. తాజాగా మోడల్ డింపుల్ పౌలా కూడా ఆయనపై లైంగిక ఆరోపణలు చేసింది. తనకు 17ఏళ్ల వయసున్నప్పుడు`హౌస్‌ఫుల్` సినిమాలో పాత్ర కోసం సాజిద్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలోనే తనను లైంగికంగా వేధించాడని పౌలా ఆరోపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. `మీటూ ఉద్యమం ప్రారంభమైనపుడు సాజిద్ ఖాన్‌పై చాలా మంది ఆరోపణలు చేశారు. అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కుటుంబ పోషణ కోసం నా సంపాదన అవసరం కావడంతో సైలెంట్‌గా ఉండిపోయా. ఇప్పుడు నా బ్రతుకు నేను బతుకుతున్నా. అందుకే ఇప్పుడు ధైర్యంగా బయటికొచ్చిచెబుతున్నా’ అని పౌలా తెలిపింది. Also Read: ‘సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన నాతో సాజిద్ అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి పిలిచిన తన ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలబడమని కోరాడు. నాకంటే ముందు అలా ఎంతమంది అమ్మాయిలను వేధించాడో దేవుడికే తెలుసు. ఇలాంటి కామాంధులు ఉండాల్సింది సమాజంలో కాదు కటకటాల వెనుక. అతడి నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడం నేను చేసిన తప్పు’ అని పౌలా పేర్కొంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hmLcae
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...