Friday, 11 September 2020

‘ఏ తప్పూ చేయలేదు.. నన్ను బకరాని చేశారు’.. హాస్పిటల్‌లో రచ్చ చేసిన హీరోయిన్

డ్రగ్స్ వినియోగం, సరఫరా ఆరోపణలతో అరెస్టయిన సినీనటి పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలో ఉన్న సంజనాకు డోప్ పరీక్షలు చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లగా నానా రచ్చ చేసింది. ఈ కేసులో పోలీసులు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది బడాబాబుల పేర్లను వీరిద్దరు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంజనాకు డ్రగ్ టెస్ట్ చేసేందుకు పోలీసుల ఆమెను బెంగళూరులోని కేసీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమె బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తుండగా సంజనా హల్‌చల్ చేసింది. డాక్టర్లకు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ‘ఈ కేసులో నన్నెందుకు అరెస్ట్ చేశారు. అందరూ కలిసి నన్ను బకరాని చేశారు. ఎలాంటి తప్పు చేయని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదు’ అంటూ కేకలు వేసింది. Also Read: డ్రగ్స్ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే సంజన సీక్రెట్ మ్యారేజ్ విషయం బయటపడింది. బెంగుళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను సంజన వివాహం చేసుకుందని గతేడాదే మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చిన సంజన.. ఇటీవల అరెస్ట్ అయ్యాక కూడా తాను పెళ్లి చేసుకోలేదనే చెప్పింది. తన పెళ్లి విషయమై వస్తున్న రూమర్స్ నమ్మవద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే పోలీస్ విచారణలో సంజన తన పెళ్లి విషయమై మాట మార్చినట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లికి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో తనకు పెళ్లయిందని ఆమె ఒప్పుకుందట. \


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fs0vBv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...