Tuesday, 22 September 2020

జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, అది ఫేక్ న్యూస్: దియా మీర్జా

డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణలో తాజాగా దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌ పేర్లు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండగానే తాజాగా నమ్రతా శిరోద్కర్, పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దియా మీర్జాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో డ్రగ్స్ డీలర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో దియా మీర్జాతో పాటు ఆమె మేనేజర్‌ని విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. Also Read: అయితే తనపై వస్తున్న ఆరోపణలపై దియా మీర్జా తీవ్రంగా స్పందించారు. జీవితంలో తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారమని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని, కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌ తదితరులకు త్వరలోనే నోటీసులు అందనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iUyT6O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...