Tuesday, 1 September 2020

ఇది సైడ్ బిజినెస్ మాత్రమే మెయిన్ బిజినెస్ వేరే ఉంది.. కన్నుపొట్టి పరేషాన్ చేసిన నివేదా థామస్

ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా చేస్తున్నారు. సోషల్ మీడియా హవా పెరగడంతో నటీనటులు తమ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ సింగిల్ డైలాగ్‌తో పరేషాన్ చేసేసింది. తన లేటెస్ట్ మూవీ సినిమాలోని కత్తిలాంటి డైలాగ్ చెబుతూ కన్నుకొట్టింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన V సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆసక్తికర వీడియో షేర్ చేసింది నివేదా థామస్. ''ఇది సైడ్ బిజినెస్ మాత్రమే మెయిన్ బిజినెస్ వేరే ఉంది'' అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో నాచురల్ స్టార్ , ప్రధాన పాత్రలు పోషించగా.. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. 'సైరా నరసింహా రెడ్డి' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. Also Read: ఇక ఈ సినిమాలో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. నాని కెరీర్‌లో 25వ సినిమాగా V ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నిజానికి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లు వేచి చూసిన చిత్రయూనిట్.. నేటికీ సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hQMFXx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...