Monday, 28 September 2020

అందువల్లే ఛాన్సులు రావడం లేదు.. అయినా ఏడుస్తూ కూర్చోను: శ్రుతిహాసన్

ఏ రంగంలోనైనా ముక్కసూటిదనంగా ఉంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్. విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో యంగ్ హీరోలతో పాటు స్టార్‌ నటుల సరసన నటించిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌కు ముక్కు సూటితనంగా మాట్లాడటం అలవాటు. Also Read: తాజాగా అభిమానులతో సోషల్‌మీడియా ద్వారా ఇంటరాక్ట్‌ అయిన శ్రుతిహాసన్ సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలు, వివాదాలపై తనదైన శైలిలో స్పందించింది. ప్రతి రంగంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయని, అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీనే అందరూ వేలెత్తి చూపడం సరికాదని అభిప్రాయపడింది. కమల్‌ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాను తొలి దశలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్రుతి తెలిపింది. Also Read: నాకు మొహమాటం లేకుండా, ముక్కసూటిగా మాట్లాడటం అలవాటు. ఎదుటి వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే క్యారెక్టర్ నచ్చకపోతే నేను లెక్క చేయను. మనసులో ఎలా అనిపిస్తే అలా పైకి మాట్లాడేస్తూ ఉంటా. ఆ ధోరణి వల్లే ఎన్నో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నా. అలాగని అవకాశాలు లేవని ఏడుస్తూ కూర్చోలేదు. ఏ రంగంలోనైనా ఇలాంటి పరిస్థితి సాధరణమే. కార్పోరేట్ రంగంలోనూ చాలామంది మహిళలు ఉన్నతాధికారుల వద్ద ముక్కుసూటిగా ఉంటూ ఉద్యోగాలు కోల్పోయిన వారున్నారు. నేను ఎంత కష్టంలో ఉన్నా వ్యక్తి్త్వాన్ని మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలేదు’ అని శ్రుతి చెప్పుకొచ్చింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kWzntw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...