Monday, 28 September 2020

దీర్ఘఆయుష్మాన్‌భవ: మరోసారి యముడిగా కైకాల సత్యనారాయణ.. ఫస్ట్‌సాంగ్ రిలీజ్

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతున్న చిత్రం ''. డా ఎంవికె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. 'కొంచం కొంచం కొంచం దగ్గరైపో' అంటూ సాగిపోతున్న ఈ లిరికల్ సాంగ్ రొమాంటిక్ సన్నివేశాలతో యూత్‌ని యమ ఆకర్షిస్తోంది. చాలా రొజుల తర్వాత సీనియర్ యాక్టర్ యముడిగా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ ఉండనుందని, సోషియో ఫాంటసీ ప్రేమకథా సినిమాగా మీ ముందుకొస్తున్నామని డైరెక్టర్ పూర్ణానంద్‌ అన్నారు. చిత్రీకరణ పూర్తయిందని, గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. త్వరలొనే సినిమాను ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. Also Read: అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ప్రతిమ.జి తెలిపారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి బాగా నటించారని అన్నారు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చగా.. పృథ్వీరాజ్‌,సత్యం రాజేష్, జెమినిసురేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EJRe7S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...