Monday, 28 September 2020

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ట్రైల‌ర్: బోయ్‌ఫ్రెండ్ లక్స్ సోపు.. డెటాల్ సోపు లాంటోడా!!

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న ఆహా ఓటీటీలో విడుద‌ల‌వుతుంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరప‌రిచిన పాట‌లు ఇప్పటికే సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా, చిత్ర ప్రచారంలో భాగంగా ‘ఒరేయ్ బుజ్జిగా..’ ట్రైల‌ర్‌ను ఈ రోజు(సెప్టెంబ‌ర్ 28న) యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ఒరేయ్‌ బుజ్జిగా ట్రైల‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుంది. విజ‌య్ కుమార్ గారికి అలాగే రాజ్‌ త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, హెబా ప‌టేల్ సహా ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. అక్టోబ‌ర్ 2న అంద‌రూ ఆహాలో సినిమా చూడండి’’ అని అన్నారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాను నాగచైతన్య గతంలో చేశారు. Also Read: ఇదిలా ఉంటే, ‘ఒరేయ్ బుజ్జిగా..’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఈ సినిమా మంచి ఫ‌న్ రైడ్ అని అర్థమైపోతుంది. రాజ్ త‌రుణ్, మాళ‌విక‌ల‌ ఎన‌ర్జిటిక్ పె‌ర్‌ఫామెన్స్ హెబా ప‌టేల్ అందం.. సప్తగిరి, న‌రేష్‌, మ‌ధునంద‌న్‌, స‌త్య, పోసాని కృష్ణమురళిల హిలేరియ‌స్ కామెడీతో ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా సాగనుంది. చాలా రోజుల త‌ర‌వాత ఈ సినిమా ద్వారా వాణీ విశ్వనాథ్ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో మ‌ళ్లీ తెర‌పై క‌నిపించబోతున్నారు. ‘‘అమ్మాయి పేరు కృష్ణవేణి.. ఇంటిపేరు వీర‌మాచినేని, మీ అమ్మాయిల‌కు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నంత ‌సేపు బోయ్ ఫ్రెండ్ ల‌క్స్ సోప్‌ లాంటోడు.. ఒల్లంతా రాసేసుకుంటారు.. బ్రేక్అప్ అయిపోయిన త‌ర్వాత డెటాల్ సోప్‌ లాంటోడ‌ని చేతులు మాత్రమే క‌డుక్కుంటారు’’ వంటి డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఐ.ఆండ్రూ విజువ‌ల్స్‌, అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయ‌ని తెలుస్తుంది. Also Read: ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌ నటించగా.. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: నంద్యాల రవి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mXm8dY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...