Wednesday, 23 September 2020

మళ్లీ నాగార్జుననే నమ్ముకున్న యంగ్ హీరో!

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలతోనే తనదైన ముద్ర వేశాడు. సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్, ఈడో రకం ఆడో రకం లాంటి సినిమాలు అతడికి మంచి గుర్తింపు నిచ్చాయి. అయితే ఇలాంటి వరుస ప్లాఫులతో అతడి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇటీవలే దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే తాజా సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ అక్టోబర్ 2న ఓటీటీ ద్వారా విడుదల సిద్ధమవుతున్నప్పటికీ దానిపై ఎలాంటి అంచనాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం అతడి మార్కెట్‌ను బట్టి పెద్ద నిర్మాతలెవరూ సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను నిర్మించడానికి నాగార్జున ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌కి పక్కా హిట్ కొట్టేలా స్ర్కిప్ట్‌ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రాజ్‌ తరుణ్ తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ చిత్రాన్ని బ్యానర్‌పై నాగార్జున నిర్మించారు. దీంతో నాగార్జున నిర్మాణంలో తనకు మరో హిట్ ఖాయమని రాజ్‌తరుణ్ భావిస్తు్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఉయ్యాల జంపాల’ వంటి హిట్టే కాదు.. రంగులరాట్నం’ వంటి డిజాస్టర్‌ కూడా ఉంది. దీంతో ఈ సెంటిమెంట్ దేనికి దారి తీస్తుందోనని చూడాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kHUujc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...