Wednesday, 23 September 2020

టాలీవుడ్‌లోకి మాజీ మిస్ ఇండియా ఎంట్రీ.. ‘బ్లాక్ రోజ్’‌లో షైలాక్ తరహా పాత్ర

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మిస్ ఇండియా కిరీటం తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఊర్వశి అనేక సినిమాల్లో నటించింది. ఇప్పుడు విభిన్న పాత్ర ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతున్న ‘’ సినిమాలో ఊర్వశి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను యూనిట్ బుధవారం విడుదల చేసింది. Also Read: ఏమైంది ఈవేళ, రచ్చ , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్‌ స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్`` లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే యోగ్యత లేని, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం" అనే కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోని కాన్సెప్ట్‌ని జోడిస్తూ అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు యూనిట్ చెబుతోంది. అనేక సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ విన్న వెంటనే ఊర్వశి రౌటేలా ఇంప్రస్ అయ్యారని, తొలిసారి తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేశారని యూనిట్ చెబుతోంది. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. Also Read: రూ.3వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలో రిలేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న వసుధ అనే మహిళ జీవితంలో ఒకరోజులో జరిగిన సంఘటనల సమాహారమే ‘బ్లాక్ రోజ్’ సినిమా. చిత్ర యూనిట్ మొత్తానికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒకే షెడ్యూల్‌లోనే షూటింగ్ మొత్తం జరిపినట్లు నిర్మాతలు తెలిపారు. సినిమా వివరాలు: రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ, ఎడిటర్: తమ్మిరాజు, పీఆర్వో: బి.ఎ.రాజు, డిఓపి: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, క్రియేటెడ్ బై: సంపత్ నంది, దర్శకత్వం: మోహన్ భరద్వాజ్ Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RO7veK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...