Wednesday, 16 September 2020

నాగబాబుకి కరోనా పాజిటివ్: మెగా బ్రదర్ క్లారిటీ.. గందరగోళానికి గురవుతోన్న ఫ్యాన్స్

నాగబాబుకు కరోనా వైరస్ సోకిందా? సోషల్ మీడియా ద్వారా ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారా? అంటే ఏమో.. అనుకుంటా.. అని గందరగోళ పరిస్థితిలో ఫ్యాన్స్ సమాధానాలు చెబుతున్నారు. దీనికి కారణం తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని సూటిగా చెప్పకపోవడమే. ‘‘ఒక ఇన్ఫెక్షన్ ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మార్చుకోవచ్చు. కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో పోరాడి ప్లాస్మా దాతను కావాలి’’ అని నాగబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌లో తనకు కరోనా సోకినట్టు నాగబాబు వెల్లడించినా కొంత మందికి ఈ విషయం అర్థం కాలేదు. సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతుంటే.. వారికి ఇంకొంత మంది రిప్లై ఇస్తున్నారు. నాగబాబుకు కరోనా సోకలేదని, మనల్ని ప్లాస్మా దానం చేయమని చెబుతున్నారని అంటున్నారు. వారికి అలా అర్థమైంది అనుకోండి. మొత్తం మీద నాగబాబుకు కరోనా పాజిటివ్. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్, రాజమాళి కుటుంబం, యం.యం.కీరవాణి కుటుంబం, సింగర్ సునీత, సింగర్ మాళవిక, పాప్ సింగర్ స్మిత, టీవీ నటులు రవికృష్ణ, నవ్య స్వామి, ‘సాక్షి’ శివ, హరికృష్ణ, ప్రభాకర్, భరత్వాజ్ ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న యం.యం.కీరవాణి కుటుంబం ప్లాస్మా దానం కూడా చేసింది. నాగబాబు కూడా కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RwEpk8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...