Thursday, 24 September 2020

జంతువులా కొట్టాడు.. ఇకపై నా భర్తతో కలిసి ఉండను: పూనమ్ పాండే

సెక్సీ మోడల్ పెళ్లి జరిగి నెల రోజులు తిరగకముందే భర్తపై కేసు పెట్టి అతడిని అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను పూనమ్‌ ఈ నెల 1వ తేదీన పెళ్లి చేసుకుంది. 20 రోజులకే భర్త తనను వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఆమె గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ షూటింగ్ నిమిత్తం గోవాకు వెళ్లిన పూనమ్ అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 22వ తేదీని సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. మరుసటి రోజే గోవా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అతడు బయటికి వచ్చాడు. Also Read: అయితే బాయ్‌ఫ్రెండ్‌తో రెండేళ్లుగా కలిసి ఉంటున్న పూనమ్ పాండే.. పెళ్లయిన 20 రోజులకే అతడిని ఎందుకు అరెస్ట్ చేయించిందోనని అందరినీ డౌట్ వచ్చింది. దీనికి తాజా ఇంటర్వ్యూలో పూనమ్ సమాధానాన్ని ఇచ్చింది. సామ్‌తో బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని, అతడిలో మార్పు వస్తుందన్న నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సామ్ తనపై ఎప్పుడూ అధికారం చెలాయించేవాడని, చిన్న విషయాలకే ఆవేశపడేవాడని తెలిపింది. గోవాలో జరిగిన ఘటన గురించి పూనమ్ మాట్లాడుతూ.. ‘సామ్‌తో నాకు ఓ విషయంలో వాదన మొదలైంది. అది పెరిగి గొడవలా మారింది. దీంతో అతడు నన్ను కొట్టాడు. చిత్రహింసలు పెట్టాడు. నా జుట్టు పట్టుకుని లాక్కెళ్లి మంచానికేసి కొట్టాడు. మొహంపై పిడికిలితో గుద్దాడు. ఆ సమయంలో చనిపోతానేమోనని అనుకున్నా. కానీ లక్కీగా అతడి బారి నుంచి తప్పించుకుని హోటల్ సిబ్బంది సాయంతో పోలీసులను ఆశ్రయించాను. దీంతో పోలీసులు సామ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. Also Read: ఓ మహిళ అన్న కనికరం కూడా లేకుండా సామ్ నన్ను జంతువు కొట్టినట్లు కొట్టాడు. అలాంటి మనిషితో ఇకపై కలిసి బ్రతకలేను. తిరిగి అతడి వద్దకు వెళ్లే ఆలోచనే లేదు. మా బంధాన్ని కాపాడుకునేందుకు నేను ఎన్నో బాధలు పడ్డాను. ఇక్కడితో మా పెళ్లికి ముగింపు పలకాలనుకుంటున్నాను’ అంటూ పూనమ్ తన బాధను చెప్పుకొచ్చింది. మోడలింగ్, సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, సెక్సీ వీడియోలతో బాగా పాపులర్ అయింది పూనమ్ పాండే. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి నెలరోజులు తిరగకముందే భర్తపై కేసు పెట్టి మరోసారి వార్తల్లోకెక్కింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3637FHu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...