Tuesday, 1 September 2020

రికార్డుల వేటకి పవర్ స్టార్ రెడీ.. రేపు ఉదయం తొమ్మిది తొమ్మిదికి.. జాతర మామూలుగా లేదు

#HBDPawanKalyan ఈ హ్యాష్ టాగ్‌తో పవన్ అభిమానులు సాయంత్రం 6 గంటల నుంచి ట్వీట్ల యుద్దం మొదలుపెట్టేశారు. ఇంతకు ముందు అప్పటి వరకూ ఉన్న కలెక్షన్ల రికార్డులు బద్దలవ్వాలని అభిమానులు కోరుకునే వారు.. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల కలెక్షన్ల సంగతి పక్కనపెడితే.. సినిమా విడుదలయ్యే పరిస్థితిలే లేకపోవడంతో రికార్డుల వేటకు ట్విట్టర్‌నే వేదికగా మార్చేస్తున్నారు. బర్త్ డే వచ్చిందంటే హ్యాపీ బర్త్ డే విషెష్ అందిస్తూ ట్విట్టర్‌ని హీటెక్కిస్తున్నారు. అంతకు ముందు ఉన్న ట్వీట్ల రికార్డుల్ని బద్దలు కొట్టేందుకు ట్వీట్ల‌తో యుద్ధం ప్రకటిస్తున్నారు ఫ్యాన్స్. ఇక మామూలు టైంలోనే బర్త్ డే అంటూ ట్విట్టర్ షేక్ అయిపోవడం ఖాయమే. ఇక ట్వీట్ల రికార్డ్‌ ముందుండటంతో పవన్ ఫ్యాన్స్ #HBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌ని ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు. మంగళవారం సాయత్రం 6 గంటల నుంచి ఈ ట్వీట్ వార్ మొదలుకాగా.. రేపు సాయంత్రం 6 వరకూ కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్‌ బర్త్ డే ట్వీట్లతో పాత రికార్డుల్ని తుడిచేయడం.. కొత్త రికార్డుల్ని రాసేయడం ఇప్పటికే ఖాయమైంది. ఇక పోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే అప్డేట్‌ను అందించింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్. ‘రేపు ఉదయం 9. 9 గంటలకు మోషన్ పోస్టర్‌ని విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ మోషన్ పోస్టర్‌తో పాత రికార్డులు చెరిపేయడం ఖాయమే అంటూ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌తో పాటు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మళ్లీ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్‌’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32NJGc2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...