Tuesday, 1 September 2020

కుప్పంలో విషాదం: బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. ముగ్గురు పవన్ అభిమానులు మృతి

జనసేన అధినేత, పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. రేపు (సెప్టెంబర్ 2న) పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురష్కరించుకుని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై అభిమానులు బ్యానర్ కడుతుండగా ప్రమాదం జరిగింది. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై 20 అడుగుల ఎత్తున్న బ్యానర్ కడుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా పోలీసులు గుర్తించారు. చెట్టంత కొడుకులు ఇలా అకాల మరణం చెందడంపై వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ రేపు 49వ ఏట అడుగుపెడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలను జరుపుకోరు. ఇలాంటి ఆడంబరాలకు ఆయన దూరంగానే ఉంటారు. అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున పవన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. అయితే, ఈసారి పవన్ అభిమానులు, జనసైనికులు తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని హాస్పిటల్స్‌కి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అందజేశారు. జనసైనికులు తీసుకున్న ఈ మంచి పనిని పవన్ కూడా అభినందించారు. ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QIJvJF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...