Friday, 11 September 2020

‘రైడర్’ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ రిలీజ్.. యాక్షన్ లుక్‌లో నిఖిల్ గౌడ

‘జాగ్వార్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ కుమార్ గౌడ. కన్నడ, తెలుగు భాషల్లో భారీ హైప్‌తో రిలీజైన ఈ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. నటుడిగా నిఖిల్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రెండు సినిమాలను కన్నడంలోనే చేసిన ఈ యువహీరో.. నాలుగో చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాడు. Also Read: ‘రైడర్’ అని నామకరణం చేసిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. Also Read: మోషన్ పోస్టర్‌లో హీరో బాస్కెట్ బాల్‌ను విసరడం, ఆ తర్వాత రౌడీలను చితక్కొడుతూ పరుగు తీస్తున్నట్లు కనిపించారు. ఫస్ట్‌లుక్ చూస్తుంటే రైడర్ అన్న టైటిల్ సరిగ్గా సరిపోయేలా ఉంది. నిఖిల్ సరసన కశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RjJY53
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...