Friday, 11 September 2020

బీబీ3 అప్‌డేట్... బాలయ్య కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేస్తున్న బోయపాటి

తన కెరీర్లో సింహా, లెజెండ్ వంటి రెండు సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో మూడోసారి జతకట్టారు నందమూరి నటసింహ బాలకృష్ణ. బీబీ3 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాకపోవడంతో రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. Also Read: ఈ కోవలోనే ఓ వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఓ పాత్రకు సంబంధించి హీరోయిన్‌గా సీనియర్ నటి సిమ్రాన్‌ను ఎంపికి చేసినట్లు తెలుస్తోంది. సమరసింహారెడ్డి, సీమసింహం, నరసింహనాయుడు వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ నటించింది. అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ఆ సినిమాల్లో బాలయ్యకు పోటీ ఇచ్చింది సిమ్రాన్. తాజాగా ఈ జోడీ మళ్లీ కలిసి నటించనున్నారన్న ప్రచారంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఓ వైపు బాలయ్య-బోయపాటి సూపర్‌హిట్ కాంబినేషన్, మరోవైపు బాలయ్య-సిమ్రాన్ సూపర్ జోడీ.. ఈ కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో యువ హీరో నవీన్ చంద్ర ఎమ్మెల్యేగా నటించనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన #BB3 First Roar టీజర్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hnZoji
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...