నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలతో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో రియాతో పాటు అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు సెప్టెంబర్ 11న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వీరంతా ముంబయిలోని బైకుల్లా జైల్లో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ బుధవారం(సెప్టెంబర్ 23) విచారణకు రానుంది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉందంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iOsfyV
v
No comments:
Post a Comment