Tuesday, 8 September 2020

Akhil Akkineni: అక్కినేని అభిమానులకు స్పెషల్ కిక్.. సైరా దర్శకుడితో నట వారసుడు.. బిగ్ అనౌన్స్‌మెంట్

అక్కినేని అభిమానులు ఖుషీ అయ్యేలా బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో బిజీగా అఖిల్ తదుపరి మూవీ కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి- అఖిల్ కాంబోలో సినిమా రానున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ ప్రకటన చేశారు యూనిట్ సభ్యులు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. , సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్‌లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించనున్నారు. అఖిల్ కెరీర్‌లో 5వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్‌గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేనిని సరికొత్తగా ఆవిష్కరించనున్నారని సమాచారం. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు. Also Read: మరోవైపు అఖిల్ తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ పోస్టర్స్, వీడియోలు సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. సో చూస్తుంటే.. ఇక ఈ అక్కినేని నట వారసుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకొని లైమ్ లైట్ లోకి వచ్చేస్తాడని అనిపిస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bHlSdP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...