మౌనరాగం సీరియల్ ఫేమ్ చేసుకోవడంతో బుల్లితెర ప్రేక్షక లోకం షాకైంది. బుధవారం ఉదయాన్నే మరణవార్త బుల్లితెర లోకాన్ని కలచివేసింది. హైదరాబాద్ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. మంచి భవిష్యత్ ఉన్న నటి ఇలా ఆత్మహత్యకు పాల్పడటం ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా శ్రావణి బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎనిమిదేళ్లగా ఆమె టీవీ సీరియల్స్ చేస్తున్న శ్రావణిని.. ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న వేళ కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్‌టాక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, అయితే ఆ తర్వాత సదరు యువకుడు శ్రావణిని వేధించి ఈ మరణానికి కారణమయ్యాడని వారు ఆవేదన చెందారు. Also Read: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ శ్రావణితో టిక్ టాక్‌లో పరిచయం ఏర్పరచుకొని బాగా దగ్గరయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెలిగారు. అయితే గత కొన్ని రోజులుగా సదరు యువకుడు డబ్బు కోసం శ్రావణిని వేధిస్తున్నాడని, డబ్బు ఇవ్వలేదంటే తమ సన్నిహిత ఫోటోలను బయటపెడతానని హెచ్చరించడం కారణం గానే శ్రావణి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రావణి మరణానికి కారణమైన ఆ యువకుడికి తగిన శిక్ష విధించాలని కోరారు. ఈ మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజు రెడ్డిపై SR నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు.. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌తో పాటు మరికొన్నింటిలో శ్రావణి నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32dfCY8
v
No comments:
Post a Comment