Tuesday, 8 September 2020

Drugs Rocket: ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్.. బుజ్జిగాడు హీరోయిన్ ఇంట్లో సోదాలు.. అరెస్ట్

ఓ వైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ ఉదంతాలు సంచలనంగా మారగా.. మరోవైపు కన్నడ సినీ పరిశ్రమలో వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. శాండ‌ల్‌వుడ్‌ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో సంబంధాలున్నాయని తెలియడంతో గత కొన్ని రోజులుగా బెంగుళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌ను, క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరోయిన్ సంజన గల్రానిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో సంజనా పేరు మారు మోగుతుండటంతో నిన్న (మంగళవారం) ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు బెంగుళూరు పోలీసులు. మహిళా పోలీస్ విభాగంతో సంజన నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. ఆమెను రెండు గంటల పాటు ప్రశ్నించి ఆ తర్వాత ప్రాథమిక అంచనాకు వచ్చి అరెస్ట్ చేశారు. అనంతరం కేసీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సంజనను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. Also Read: డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో సంజనకు సబంధాలున్నాయని, ఆమె రెగ్యులర్‌గా రేవ్ పార్టీల్లో పాల్గొంటూ డ్రగ్స్ వాడుతుందనే సమాచారం మేరకు సంజన ఇంటిపై దాడులు నిర్వహించినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు. ఈ సోదాల్లో ఆమె నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లో పలు ఫోటోలు, వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో సంజన డ్రగ్స్ భారీగా వినియోగించినట్టు రాహుల్‌ను విచారణ చేయగా బయటపడిందని పోలీసులు అంటున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే మరోసారి డ్రగ్స్ ఇష్యూ పెను సంచలనంగా మారుతుందేమో అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fd06Tf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...