Tuesday, 4 August 2020

Varun Tej: ఫేమస్ హీరోయిన్‌తో వరుణ్ తేజ్ పెళ్లంట.. నాగబాబు ప్లాన్ ఇదే! మెగా హీరో పెళ్లి వార్త వైరల్

ఈ లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వరుసపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, నితిన్ అగ్నిసాక్షిగా ఏడడుగులేయగా దగ్గుబాటి రానా తన ఇష్టసఖి మిహికాను పెళ్లాడేందుకు రెడీ అయ్యారు. మరోవైపు మెగా ఫ్యామిలీలో కూడా పెళ్లి సందడి మొదలయింది. అతిత్వరలో మెగా బ్రదర్ కూతురు నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. ఇంతలో నిహారిక బ్రదర్, హీరో కూడా పెళ్లికి రెడీ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. వరుసపెట్టి టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో ఇదే అదనుగా ఈ వార్తలు పుట్టించారో లేక నిజంగానే వరుణ్ తేజ్ పెళ్లికి రెడీ అయ్యారో తెలియదు గానీ.. ఓ ఫేమస్ యంగ్ హీరోయిన్‌ని వరుణ్ పెళ్లాడబోతున్నారని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఆ హీరోయిన్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలో నటించిందని హింట్స్ కూడా ఇచ్చేశారు గాసిప్ రాయుళ్లు. Also Read: గత కొంతకాలంగా వరుణ్ ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారని, ఈ విషయం నాగబాబుకు కూడా తెలుసని.. ఇప్పటికే ఆ హీరోయిన్ కుటుంబంతో పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా నాగబాబు పూర్తి చేసినట్లు వార్తలు రాసేశారు. నిహారిక పెళ్లి అయిన వెంటనే కూడా జరగబోతోందని అందులో పేర్కొన్నారు. ఎవ్వరూ ఊహించని ఈ న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సో.. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kcCoX6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...