Tuesday, 4 August 2020

సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్

ప్రముఖ తెలుగు పాప్ సింగర్‌ స్మిత కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిగిన టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. నిన్న వ్యాయామం చేస్తున్న సమయంలో కాస్త అలసటగా అనిపించి, ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నానమన్నారు. అయితే ఈ టెస్టుల్లో తనత పాటు భర్త శశాంక్‌కు కూడా పాజిటివ్ అని తేలిందన్నారు. కుటుంబంలో మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే కరోనా నుండి బయటపడి ప్లాస్మా దానం కూడా చేస్తానని స్మిత తెలిపారు. స్మిత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఇక ఆమె పాటల విషయానికి వస్తే.. హాయ్ రబ్బా అంటూ వచ్చిన ఆమె అల్బామ్ అందర్నీ ఎంతగానో అలరించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన కిలికిలి భాషలో కూడా ఆమె ఓ పాట పాడింది. కొన్ని రిమిక్స్‌తో సాంగ్స్‌తో కూడా అలరించింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా చేసింది స్మిత. పాడుతా తీయగా కార్యక్రమంలో కూడా స్మిత పాల్గొంది. Read More: ఓవైపు సింగర్‌గా రాణిస్తూనే.. మరోవైపు ఆమె వ్యాపారంలో కూడా అడుగు పెట్టింది. 2002లో హైదరాబాద్ జూబ్లీ హీల్స్‌లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ ప్రారంభించడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత 2006లో విజయవాడలో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించింది. దానితో పాటు ఫిట్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. ఐ కాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించిన స్మిత టీవీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31bnl7y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...