Tuesday, 4 August 2020

బుల్లి మేనకోడలితో రామ్ చరణ్ డ్యాన్స్.. మళ్లీ చిట్టిబాబులా కనిపిస్తున్నారే!!

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న మెగా పవర్ స్టార్ తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మేనకోడళ్లతో సరదగా ఆడుకుంటున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ఆ మధ్య కూరగాయలు ఎలా శుభ్రం చేయాలో తన మేనకోడళ్ల నుంచి తెలుసుకుంటూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు చరణ్. మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ఇంట్లో నేలపై ఆరబెట్టడాన్ని చూసి తన మేనకోడళ్లను ఏంటిదని చరణ్ అడిగారు. క్రిములు పోగొట్టడానికి సబ్బు నీటితో, మంచి నీటితో కూరగాయలను శుభ్రం చేశామని వాళ్లు చెప్పారు. అయితే, తాజాగా తన బుల్లి మేనకోడలు నవిష్కతో ఆడుకుంటోన్న వీడియోను చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పాపులర్ బేబీ షార్క్ పాటను టీవీలో వేసి దానికి అనుగుణంగా తన మేనకోడలితో డ్యాన్స్ చేయించే ప్రయత్నం చేశారు చరణ్. కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేశారు. చరణ్ ఎంకరేజ్ చేస్తుంటే చేతులు ఆడిస్తూ తనకు చేతనైన విధంగా డ్యాన్స్ చేసింది నవిష్క. రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె ఈ నవిష్క. శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్‌తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. 2018 డిసెంబర్ 25న అంటే క్రిష్మస్ రోజున నవిష్క జన్మించింది. ఇదిలా ఉంటే, సినిమా కోసం క్లీన్ సేవ్‌తో మెలి తిప్పిన మీసంతో కనిపించిన రామ్ చరణ్.. ఈ లాక్‌డౌన్ సమయంలో మళ్లీ గెడ్డం పెంచి ‘రంగస్థలం’ చిట్టిబాబు లుక్‌లోకి వచ్చేశారు. RRR షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా రిస్క్ చేయడం ఇష్టం లేక దర్శకధీరుడు రాజమౌళి ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. దీనికి తోడు తాజాగా రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్‌కు మరింత భయం పెరిగింది. ప్రస్తుత కరోనా పరిస్థితి నుంచి పూర్తిగా కోలుకున్న తరవాతే RRR షూటింగ్ మొదలవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xlcirl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...