Monday, 10 August 2020

Thriller: థ్రిల్లర్ రిలీజ్ డేట్ ప్రకటించిన వర్మ.. అప్సర రాణి ఘాటు అందాలకు ఫ్యాన్సీ రేటు!

థియేటర్ల కంటే ఓటీటీ అడ్వాంటేజీలు చెప్పలేనన్ని అని పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ.. డిజిటల్ టెక్నాలజీని ఫుల్లుగా వాడేస్తున్నారు. ఓ వైపు కరోనా విలయతాండవం, మరోవైపు లాక్‌డౌన్ కారణంగా బడా బడా దర్శకనిర్మాతలంతా కెమెరాను అటకెక్కించగా ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకుంటున్నారు. సొంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ప్రారంభించి.. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్న ఆయన ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ '' ద్వారా కూడా అదే చేయబోతున్నారు. Also Read: అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ నుంచి ఇప్పటికే కావాల్సినంత రొమాంటిక్ డోస్ ప్రేక్షకుల ముందుంచి సినిమాపై హైప్ తీసుకొచ్చిన వర్మ.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేస్తున్నట్లు తెలిపి ఒక్కో వ్యూ కోసం 200 రూపాయలు డిసైడ్ చేశారు. ఓవర్సీస్‌లో అయితే 9.99 యూఎస్ డాలర్స్ చెల్లించుకోవాలని పేర్కొన్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో ఈ థ్రిల్లర్ మూవీ విడుదల కానుండటం విశేషం. ఇటీవలే ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ బాగా దట్టించి చూపించిన వర్మ.. అప్సరా రాణి హాట్ అందాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరకు మాత్రం ఇది థ్రిల్లర్ అని, అంతా సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. సో చూడాలి మరి.. ఈ థ్రిలర్ సినిమాలో అప్సరా అందాలు ఎంతమందిని థ్రిల్ చేస్తాయో, వర్మకు ఎంత లాభం తెచ్చిపెడతాయో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DT3TVi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...