Monday, 10 August 2020

నగ్నంగా సుశాంత్ మాజీ మేనేజర్ దిశ డెడ్ బాడీ.. ఆ రోజు రాత్రి అందరూ కలిసి!! పోలీసుల క్లారిటీ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారింది. ఇప్పటికే అతని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి? అంతకుముందు ఏం జరిగింది? అనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఈ కేసు విషయమై సీబీఐ, ఈడీ కూడా ఎంటరై ఎంక్వైరీలు మొదలు పెట్టాయి. సుశాంత్ మరణానికి సరిగ్గా 5 రోజుల ముందు అనగా జూన్ 8న రాత్రి మలాద్లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆయన మాజీ మేనేజర్ దిశ సూసైడ్ చేసుకుంది. ఈ వెంటనే సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. పైగా సలియోన్‌ది ఆత్మహత్య కాదని.. ఆమెను రేప్ చేసి చంపేసారని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో సుశాంత్, దిశ సూసైడ్‌లకు లింక్ ఉందని జనంలో చర్చలు ముదిరాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సెన్సేషన్ అవుతోంది. దిశ ఆత్మహత్యకు ముందురోజు తన ప్రియుడు రోహాన్‌ నివాసంలో జ‌రిగిన పార్టీలో ఆమె హుషారుగా పాల్గొన్న విషయానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడం, ఇందులో దిశ ప్రియుడు రోహాన్‌ సహా మరికొందరు స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. Also Read: ఇక ఇదిలా ఉండగానే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవల మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. దీంతో తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన పోలీసులు అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేశారు. దిశ ఆత్మహత్య ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచ‌నామా చేసినట్లు డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ తేల్చి చెప్పారు. మరోవైపు దిశపై రేప్ జరిగిందని వినిపిస్తున్న వాదనలను ఆమె తల్లిదండ్రులు ఖండించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XKNRDE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...