Thursday, 6 August 2020

Rhea Chakraborty: చిరంజీవి అల్లుడికి ఝలక్ ఇచ్చిన రియా.. ఊహించని విధంగా ఆ స్టెప్!! హాట్ ఇష్యూ

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీ లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన బలవన్మరణం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ముఖ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు రావడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి ఆమెకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా రియా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌కి ఝలక్ ఇస్తూ ఆయన కొత్త సినిమా '' నుంచి తప్పుకోవడం జనాల్లో హాట్ ఇష్యూ అయింది. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి ఫేమస్ అయిన రియాకు టాలీవుడ్ తోనూ పరిచయం ఉంది. తెలుగులో ఆమె 'తూనిగ..తూనిగ' సినిమాతో పరిచయం అయింది రియా. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ బయటపెట్టి అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా 'సూపర్ మచ్చి' కోసం ఆమెతో డీల్ కుదుర్చుకున్న నిర్మాతలు.. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. ఆ తర్వాత రియా, కళ్యాణ్‌ల‌తో కూడిన ఒక‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. Also Read: అనూహ్యంగా రియా డ్రాప్ కావడంతో కన్నడ నటి రచిత రామ్‌ను ఈ సినిమాలో తీసుకున్నారని సమాచారం. అయితే ఇప్పుడు సుశాంత్ సూసైడ్ మిస్టరీలో రియా కీలకమైన వ్యక్తి అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 'సూపర్ మచ్చి' మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gA30PE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...