హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాదున్'ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, చెల్లెలు నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా 'అందాదున్' ఒరిజినల్ వర్షన్‌లో టబు పోషించిన పాత్ర సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయి మూవీ విజయంలో కీలకం అయింది. దీంతో ఈ పాత్రను తెలుగులో కూడా ఆమెతోనే చేయించాలని ప్లాన్ చేశారు కానీ అది కుదరలేదు. దీంతో అనసూయ పేరును పరిశీలనలో పెట్టిన చిత్రయూనిట్ అది కూడా సెట్ కాకపోవడంతో చివరకు నయనతారపై కన్నేసిందట. లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో సత్తా చాటే నైపుణ్యమున్న నయన్ అయితేనే ఈ పవర్ ఫుల్ రోల్‌కి సూటబుల్ అని భావించిన నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. Also Read: అయితే డిమాండ్ ఉన్న పాత్ర, పైగా సినిమాలో కీలకమైన రోల్ కావడంతో నయన్ కూడా ఆసక్తి కనబరుస్తోందట. కాకపోతే రెమ్యునరేషన్ విషయంలోనే చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందాదున్ రీమేక్‌లో నటించేందుకు గాను నయన్ ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం. అయితే కాస్త అటూఇటుగా అయినా ఇచ్చి నయన్‌తో ప్రాజెక్టుపై సంతకం చేయించుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అందాదున్ తెలుగు రీమేక్ గురించి స్పందించిన నితిన్.. ఈ మూవీలో నటించాలంటే కాస్త భయంగా ఉందని అన్నాడు. `అంధాదున్`లో హీరోగా నటించిన ఆయుష్మాన్‌కు జాతీయ అవార్డు వచ్చిందని, అదే తనకు భయం కలిగిస్తోందని చెప్పాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F0efDn
v
No comments:
Post a Comment