Saturday, 8 August 2020

Rana Marriage: రానా పెళ్లిలో రామ్ చరణ్ హంగామా.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మెగా కోడలు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తన ఇష్టసఖి మిహీక మెడలో అగ్ని సాక్షిగా మూడు ముళ్లేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. అయితే కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులెవరూ వేడుకకు హాజరు కాలేదు. కేవలం ఆయన దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే విచ్చేశారు. Also Read: టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంత, నాగచైతన్య‌లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక రానాకు చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితుడైన ఈ పెళ్లిలో తెగ సందడి చేశారు. భార్య ఉపాసనతో కలిసి పెళ్లి వేడుకను ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక అదే రేంజ్‌లో సందడి చేసిన మరో జోడీ నాగచైతన్య- సమంత. ఈ జోడీ కూడా రానా పెళ్లిలో కెమెరాలను విపరీతంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, మార్వారీ సాంప్రదాయాల్లో రానా- మిహీక వివాహాన్ని జరిపించారు. ఈ వివాహ వేడుక పనుల్ని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్వహించింది. పెళ్లికి వచ్చిన అతిథులకు తెలుగు వంటకాలతో పాటు.. రాజస్థాన్ వంటకాలతో విందు అందించారు. హైదరాబాద్‌లో తాజ్ ఫలక్‌నుమా హోటల్ నుంచి ఈ వంటకాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇక పరిస్థితుల దృష్ట్యా ఈ పెళ్లి వేడుకకు హాజరుకాని సినీ ప్రముఖులకు కరోనా తగ్గగానే గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు రానా దంపతులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3io229U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...