సూపర్ స్టార్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (ఆగస్టు 9) సోషల్ మీడియా అంతా మహేష్ మేనియాతో హోరెత్తిపోతోంది. ఆయనకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బర్త్ డే పై స్పందించిన మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వీట్ విషెస్ తెలుపుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాది మీకు అద్భుత విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు చిరంజీవి. దీంతో ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోతూ మెగాస్టార్‌కి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. Also Read: మరోవైపు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి అట్రాక్ట్ చేశారు ఆ సినిమా దర్శకనిర్మాతలు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. మరికూడి రోజుల్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31w3yzO
v
No comments:
Post a Comment