Saturday, 8 August 2020

Mahesh Babu: సర్కారు వారి పాట సర్‌ప్రైజ్.. సేమ్ మ్యాజిక్!! మహేష్ పుట్టినరోజు కానుక అదిరింది

సూపర్ స్టార్ సందర్భంగా ఆయన అభిమానులను థ్రిల్ చేసింది '' టీమ్. ఇటీవలే తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా మహేష్ 27వ సినిమా టైటిల్ 'సర్కారు వారి పాట' అని ప్రకటిస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ రోజు (ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డేను పురస్కరించుకుని ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను ఆగస్ట్ 9న ఉదయం 9గంటల 9నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించిన యూనిట్ సభ్యులు.. సరిగ్గా చెప్పిన సమయానికే మహేష్ అభిమానులను హుషారెత్తించే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా గతంలో లాగే మరోసారి అదే రూపాయి బిళ్ళతో మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో థమన్ మ్యూజిక్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ప్రీ లుక్‌లో కనిపించిన మహేష్.. ఇప్పుడు ఆ కాయిన్ టాస్ చేస్తూ ఆకట్టుకున్నారు. అయితే అప్పుడూ, ఇప్పుడూ మహేష్ ఫుల్ లుక్ మాత్రం చూపించకపోవడం విశేషం. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. Also Read: సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ మూవీలో చూపించనున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. ఆసక్తికర కథకు రొమాంటిక్ డోస్ యాడ్ చేశారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ‘సర్కారు వారి పాట’పై మహేష్ అభిమానులు పెట్టుకున్న అంచనాలు మాత్రం మిన్నంటాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ktvehB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...