Tuesday, 11 August 2020

Jr.NTR: నందమూరి అభిమానుల కోసం బోయపాటి నయా స్కెచ్! బాలయ్య, ఎన్టీఆర్‌లతో ప్రభంజనానికి ప్లాన్..

నందమూరి నట వారసులు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ ఇద్దరే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకమైన వివరణ అవసరం లేదు. వెండితెరపై నందమూరి నటసింహం డైలాగులతో హడలెత్తిస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనతో అదరగొట్టేస్తారు. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ ఇద్దరినీ ఓ రేంజ్‌లో ఆరాధిస్తుంటారు. మరి అలాంటి ఈ ఇద్దరూ ఒక్కటై వెండితెరపై అలరిస్తే ఆ ప్రభంజనం ఊహించగలమా? మీరే చెప్పండి. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యేలా ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్లాన్ రెడీ చేశారట మాస్ డైరెక్టర్ . ''సింహ, లెజెండ్'' లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకొని లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ ఖాళీ సమయంలో కథను మరింత సానబడుతున్న బోయపాటి.. కొత్త ప్లాన్ రచించారని తెలుస్తోంది. కథలో భాగంగా వచ్చే ఓ కీలకమైన పాత్ర కోసం నందమూరి కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ పేర్లు పరిశీలించిన ఆయన.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయించాలని ఫిక్స్ అయ్యారట. Also Read: నందమూరి అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్న బాలయ్య- ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్‌కి తానే శ్రీకారం చుట్టాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు తన సినిమాలోని కీలక పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఒప్పించే కార్యక్రమాలు మొదలుపెట్టేశారని సమాచారం. పవర్ఫుల్ గెస్ట్ రోల్ కాబట్టి బాబాయ్, అబ్బాయ్ ప్రభంజనంతో రీ ఓపెన్ తర్వాత థియేటర్స్ హోరెత్తిపోవాలని బోయపాటి ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్. బోయపాటి వేస్తున్న ఈ స్కెచ్ వర్కవుట్ అయి ఎన్టీఆర్ ఒప్పుకోవాలే గానీ నందమూరి అభిమానులకు అంతకన్నా కన్నులపండగ మరొకటి ఉండదు. సో.. చూడాలి మరి బోయపాటి ప్రయత్నాలు, నందమూరి అభిమానుల ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gN9R8F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...