Tuesday, 11 August 2020

టైగర్ ష్రాఫ్ సినిమాలో అల్లు అర్జున్!

బాలీవుడు ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇది హీరోగా వచ్చిన ‘పరుగు’ సినిమాకు హిందీ రీమేక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో షబీర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. తొలి సినిమాతో ఘన విజయం అందుకున్న టైగర్ ష్రాఫ్.. ఆ తరవాత వరుస హిట్లతో బాలీవుడ్ యాక్షన్ హీరోగా ఎదుగుతున్నారు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ తరవాత ఆ స్థాయిలో డ్యాన్స్ చేయగల హీరోగా టైగర్ ష్రాఫ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే, ఆరేళ్ల తరవాత ఇప్పుడు ‘హీరోపంతి’కి సీక్వెల్ వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ‘హీరోపంతి 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. అయితే ఈ సీక్వెల్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న వార్తలు. బన్నీ ఒక ముఖ్యమైన అతిథి పాత్రను చేయబోతున్నారని అంటున్నారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. Also Read: నిజానికి అల్లు అర్జున్ అంటే టైగర్‌కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. రేండేళ్ల క్రితం ఓ సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్ వచ్చిన టైగర్.. తాను అల్లు అర్జున్ అభిమానిని అని చెప్పుకున్నారు. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. కాబట్టి, తన సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రకు టైగర్ కచ్చితంగా యస్ చెబుతారు. కానీ, అల్లు అర్జున్ ఓకే చేస్తారా? లేదా? అనేదే ప్రశ్న. పాత్ర మంచిదైతే ఆయన కచ్చితంగా చేస్తారనుకోండి. ఏదేమైనా ప్రస్తుతం వినిపిస్తున్నవి కేవలం గుసగుసలు మాత్రమే. వాటిలో నిజమెంతో తేలాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3irfbyX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...